మంగళవారం, 11 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

గుర్తింపు లేని ప్రైవేట్ కాలేజీ ఫీజుల దందా

1 గంట క్రితం

The Fee Racket of Unrecognized Private Colleges
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 11, 2026, 12:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

బోర్డులు తొలగించి , యూనిఫామ్ లు పుస్తకాలు కార్పొరేట్ పేరుతో నయా మోసం

ఫ్రెషర్స్ డే పార్టీ పేరుతో 2.5 లక్షలు వసూళ్లు

విద్యార్థులను మాయ చేసేందుకు కొత్త ఎత్తులు.....

పట్టించుకోని ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి.....


మైలవరం (ఎన్టిఆర్) : మైలవరం మండల కేంద్రంలో అనుమతులు లేకుండా నడుపుతున్న కాలేజీ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం ఉదయం స్థానిక ఎమ్మార్వో అబ్దుల్ దరియా కి మైలవరం ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి కొండిశెట్టి సురేష్, అధ్యక్షులు ఆకుల దుర్గారావు, ఉపాధ్యక్షులు మణికుమార్, సిద్దు తదితరులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .... మైలవరం మండల కేంద్రంలో ఎస్ఎఫ్ఐ పోరాటం ఫలితంగా బోర్డులు తొలగించిన ప్రైవేట్ కాలేజ్ యూనిఫామ్స్, ఎగ్జామ్ ప్యాడ్స్, బిల్లులు, రెస్సోనేన్స్ పేరుతో ఇస్తూ విద్యార్థులను విద్యార్థులు తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని, కార్పొరేట్ తరహాలో ఫీజులు వసూలు చేసేందుకు తల్లిదండ్రులకు గాళం వేసి దొంగ పాంప్లెట్లు ముద్రించి అడ్డగోలుగా వసూలు చేస్తున్నారని, వీళ్లకు మైలవరంలో ఎటువంటి అనుమతులు లేవని వారన్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స్పందించి ఇటువంటి అనుమతులు లేకుండా దొంగచాటుగా నడుపుతున్న కాలేజీలపై చర్యలు తీసుకోవాలని వారి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సోమవారం కాలేజీని ముట్టడిస్తామని హెచ్చరించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్