ప్రజాశక్తి-చంద్రగిరి (తిరుపతి) : తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం, గాదెంకి టోల్ ప్లాజా సమీపంలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. సర్వీస్ రోడ్డు నుంచి హైవేపైకి వస్తున్న బైకును కోయంబత్తూర్-తిరుపతి ప్రైవేట్ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాదెంకికి చెందిన చిన్న చెన్నయ్య (50) అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 11, 2026, 01:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)