మంగళవారం, 08 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అడవి జింక మృతి

11 ఆగస్టు, 2026

Wild deer dies
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 11, 2026, 01:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : చిలకలూరిపేట మండలం కమ్మవారిపాలెం గ్రామ సమీపంలో పోలేరమ్మ గుడి ఎదురుగా ఉన్న పంట కాలువ పక్కన ఓ జింక మృతి చెందిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. గ్రామస్థులు ఇచ్చిన సమాచారంతో అటవీశాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కోటప్పకొండ బీట్ ఆఫీసర్ కిరణ్ ఆధ్వర్యంలో జింక మృతదేహాన్ని పరిశీలించి, పశు వైద్యులతో పోస్టుమార్టం నిర్వహించారు. ప్రాథమిక నివేదిక ప్రకారం .... జింక అనారోగ్యంతోనే మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. అటవీ ప్రాంతాల్లో వన్య ప్రాణులు మృతి చెందినా లేదా గాయపడినట్లు గుర్తించిన వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని అటవీ అధికారులు, సిబ్బంది కలిసి ప్రజలను కోరారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్