న్యూఢిల్లీ: పార్లమెంట్, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మహిళా నేతలు చేపడుతున్న ఉద్యమానికి సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబి మంగళవారం సంఘీభావం తెలిపారు. జులై 20 నుంచి ఢిల్లీలో పార్లమెంట్ భవనం సమీపంలో మహిళా నేతలు ఈ డిమాండ్ కోసం ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది మహిళా నేతలు ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు. పార్లమెంట్ భవనం వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నప్పటికీ, సమీప ప్రాంతాల్లో గుమిగూడి నినాదాలు చేస్తూ తమ నిరసనను కొనసాగిస్తున్నారు. మహిళా నేతల పోరాటం చారిత్రాత్మకమైనదని ఎం.ఎ. బేబి పేర్కొన్నారు. ఈ ఉద్యమంలో పాల్గొంటున్న మహిళలందరికీ అభినందనలు తెలిపారు. వారి పోరాటానికి సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు. ‘‘రెడ్ సెల్యూట్, మిత్రులారా.. మనం పోరాడతాం, తప్పకుండా గెలుస్తాం’’ అని ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు.
33 శాతం రిజర్వేషన్ కోసం ఉద్యమిస్తున్న మహిళలకు ఎం.ఎ. బేబి సంఘీభావం
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 11, 2026, 01:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)