మంగళవారం, 11 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

సిజెపిపై సిబిఐ దర్యాప్తు పిటిషన్‌.. కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

1 గంట క్రితం

CJP  activities
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 11, 2026, 01:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : కాక్రోచ్‌ జనతా పార్టీ (సిజెపి ) అనే డిజిటల్‌ రాజకీయ కూటమి కార్యకలాపాలపై సిబిఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్‌పై కేంద్రానికి సుప్రీంకోర్టు మంగళవారం నోటీసు జారీ చేసింది. కోర్టులో జడ్జి చేసిన వ్యాఖ్యలను డబ్బు సంపాదించే లేదా వాణిజ్య ప్రయోజనాలకు వినియోగించడంపై వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల నుండి స్పందన కోరింది. సుప్రీంకోర్టు న్యాయవాది రాజా చౌదరి తరపున న్యాయవాది రాజేష్‌ సింగ్‌ చౌహాన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌లో కేంద్ర ప్రభుత్వం, ఎలక్ట్రానిక్స్‌, సమాచార సాంకేతిక శాఖ, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, సిబిఐలను ప్రతివాదులుగా చేర్చారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్