బెంగళూరు : బెంగళూరులో గల్లంతైన 65 లక్షల ఓట్లలో తన ఓటు కూడా ఉన్నదని, ఇది చాలా హాస్యాస్పదంగా అనిపిస్తోందని సినీనటుడు ప్రకాష్ రాజ్ తెలిపారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో ఓ సెల్ఫీ వీడియోను పంచుకున్నారు. ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision) పై ఆయన మాట్లాడుతూ .... తాను పుట్టి పెరిగిన నియోజకవర్గంలో తన ఓటును తొలగించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ తర్వాత బెంగళూరు నియోజకవర్గంలో తొలగించిన 65 లక్షల ఓట్లలో తనది కూడా ఉందని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. తాను బెంగళూరు నియోజకవర్గంలోనే పుట్టానని, ఇక్కడే నివసించానని, చదువంతా ఇక్కడే పూర్తయిందని, నటన నేర్చుకున్నది కూడా ఇక్కడేనని తెలిపారు. అన్నిటికంటే ముఖ్యంగా తాను ఈ నియోజకవర్గం నుంచి ఎంపి అభ్యర్థిగా కూడా పోటీ చేశానని వెల్లడించారు. అయినా తన ఓటు తొలగించారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మళ్లీ ఓటర్ కార్డు పొందడానికి ఏమేం డాక్యుమెంట్లు అడుగుతారో అంటూ వ్యంగ్యంగా చమత్కరించారు. తాను అన్నిటికీ సిద్ధంగా ఉన్నానన్నారు. ‘మీకు ఓటు వేయని వారిని తొలగించే అధికారం మీకు ఉండొచ్చు. కానీ మిమ్మల్ని అధికారం నుంచి దింపకుండా మమ్మల్ని ఆపగలరా ?’ గేమ్ ఆన్ అంటూ ప్రకాష్ రాజ్ కేంద్రాన్ని నిలదీశారు.
నా ఓటు తొలగించడం హాస్యాస్పదం : ప్రకాష్ రాజ్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 11, 2026, 01:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)