ప్రజాశక్తి-చంద్రగిరి (తిరుపతి) : మహిళల భద్రతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. సోమవారం తిరుపతిలో నూతన మహిళా పోలీస్ స్టేషన్ భవనం ఘనంగా ప్రారంభమయ్యింది. హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత , రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి లతో కలసి మహిళా పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పాల్గొన్నారు. వారితో కలసి నూతన భవనంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు వస్తున్న పోలీస్ స్టేషన్లు, వాటికి సంబంధించిన భవనాలన్నీ అధునూతన సాంకేతికత పరిజ్ఞానంతో వస్తున్నాయని ఎమ్మెల్యే తెలిపారు.








కామెంట్‌లు (0)