బీజింగ్ : భారత్-చైనా సరిహద్దు వివాదంపై స్పెషల్ రిప్రజెంటేటివ్‌ల (ఎస్‌ఆర్)మధ్య 25వ విడత చర్చల కోసం జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌దోవల్ సోమవారం బీజింగ్ చేరుకున్నారు. చైనా పొలిట్‌బ్యూరో సభ్యులు, విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఆయన మంగళవారం సమావేశం కానున్నారని, చైనా ఉపాధ్యక్షుడు హన్‌జెంగ్‌తో కూడా చర్చలు జరపనున్నారని చైనా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదంపై లోతైన చర్చ జరగనుందని ఆ ప్రకటన వెల్లడించింది. సరిహద్దు సమస్యపై చైనా, భారత్‌ల మధ్య చర్చలకు చైనా, భారత ప్రత్యేక ప్రతినిధుల మధ్య జరిగే ఈ సంప్రదింపులే ప్రధాన వేదిక అని ఆ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ పేర్కొన్నారు. అలాగే పరస్పర ఆసక్తి ఉన్న అంశాలపై ఇరు పక్షాల మధ్య సంభాషణకు ఇది ఒక ముఖ్యమైన వేదిక అని అన్నారు.
బీజింగ్ చేరుకున్న అజిత్ దోవల్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 24, 2026, 05:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)