శనివారం, 25 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

తిరుపతి రుయా ఆసుపత్రిలో రోగి ఆత్మహత్య

1 గంట క్రితం

suside
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 25, 2026, 08:21 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- తిరుపతి: తిరుపతిలోని ప్రముఖ రుయా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒక రోగి దారుణంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీపీ పురం మండలం, మిద్ది కండ్రిక గ్రామానికి చెందిన కె. గంగయ్య (50) తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఈ నెల 11న రుయా ఆసుపత్రిలో చేరాడు. అక్కడ ఆయన చికిత్స పొందుతున్నారు. శుక్రవారం అర్థరాత్రి ఆసుపత్రి ప్రాంగణంలోని 'సిటివిఎస్' (CTVS) వార్డు బాత్రూమ్‌లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు. డయాలసిస్ కు ఉపయోగించే పైపుతో మెడకు బిగించుకోవడమే కాకుండా, కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆసుపత్రి సిబ్బంది మృతదేహాన్ని రుయా మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై మృతుడి కుమారుడు ఆకాష్ తిరుపతి వెస్ట్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ హేమాద్రి నేతృత్వంలో పోలీసులు ఆత్మహత్యకు గల పూర్తి కారణాలపై విచారణ జరుపుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్