19 పతకాలతో అత్యధిక పతకాలు సాధించిన పురుష అథ్లెట్‌గా ఘనత
దక్షిణాఫ్రికా స్టార్ స్విమ్మర్ చాడ్ లే క్లోస్ కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. తన ఖాతాలో మొత్తం 19 పతకాలు నమోదు చేసుకున్నాడు. కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలోనే అత్యధిక పతకాలు సాధించిన పురుష అథ్లెట్‌గా కొత్త రికార్డు సృష్టించాడు. ఈ ఘనతను పురుషుల 4×100 మీటర్ల ఫ్రీస్టైల్ రిలేలో కాంస్య పతకం గెలుచుకోవడంతో ఈ ఘనత అందుకున్నాడు. ఈ విజయంతో ఆస్ట్రేలియా షూటర్ ఫిల్ ఆడమ్స్, ఇంగ్లండ్‌కు చెందిన మిక్ గాల్ట్‌లను అధిగమించి.. కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో అత్యధిక పతకాలు సాధించిన పురుష అథ్లెట్‌గా చాడ్ లే క్లోస్ నిలిచాడు.
కాంస్యం గెలిచినా కన్నీళ్లు ఆగలేదు
34 ఏళ్ల లే క్లోస్ తన తాజా విజయంపై భావోద్వేగానికి గురయ్యాడు. “కాంస్య పతకం కోసం ఏడవకూడదు.. స్వర్ణం సాధించినప్పుడు ఏడవాలి. కానీ ఈ పతకం నాకు ఎంతో ప్రత్యేకమైనది” అని కామన్వెల్త్ గేమ్స్ అధికారిక వెబ్‌సైట్‌తో పేర్కొన్నాడు. ఇప్పటివరకు లే క్లోస్ ఖాతాలో ఏడు స్వర్ణాలు, నాలుగు రజతాలు, ఎనిమిది కాంస్య పతకాలు ఉన్నాయి.







కామెంట్‌లు (0)