బొలెరోలో యంత్రాన్ని ఎత్తుకెళ్లిన దుండగులు
ప్రజాశక్తి–మదనపల్లె టౌన్: అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలో శనివారం వేకువజామున ఏటీఎం చోరీ జరిగింది. పట్టణంలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో ఏటీఎం మిషన్‌ను బొలెరో వాహనంలో ఎత్తుకెళ్లారు. ఉదయం ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించి, అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. దుండగులు ప్రయాణించిన బొలెరో వాహనం కోసం ప్రధాన రహదారులు, చెక్‌పోస్టులు, సరిహద్దు ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తూ ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నాయి. ఏటీఎంలో ఉన్న నగదు వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.







కామెంట్‌లు (0)