శనివారం, 25 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

నేటి నుంచి అమర్‌నాథ్‌ యాత్ర పునఃప్రారంభం

2 గంటల క్రితం

amarnath yatra
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 25, 2026, 07:50 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

శ్రీనగర్‌ : భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా తాత్కాలికంగా నిలిపివేసిన అమర్‌నాథ్‌ యాత్ర నేటి నుంచి మళ్లీ ప్రారంభమైంది. జమ్ములోని భగవతినగర్‌ బేస్ క్యాంప్‌ నుంచి తొలి విడతగా దాదాపు 5 వేల మంది భక్తులు బాల్తాల్‌ బేస్ క్యాంప్‌కు బయలుదేరారు. యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భద్రతా బలగాల పహారా మధ్య యాత్రికుల వాహనాలను కాన్వాయ్‌ రూపంలో బాల్తాల్‌కు తరలిస్తున్నారు. వాతావరణ పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తూ యాత్రను సురక్షితంగా కొనసాగించేలా అధికారులు చర్యలు చేపట్టారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్