ప్రజాశక్తి-తిరుపతి టౌన్ : తిరుపతి నగరపాలక సంస్థ ఆరోగ్యాధికారి డా. యువ అన్వేష్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం నగరంలోని పలు ప్రముఖ మార్ట్‌లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహార పదార్థాలు అందుతున్నాయా అనే అంశంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా ఇన్‌స్టామార్ట్, బ్లింకిట్‌తో పాటు పలు అంతర్జాతీయ బ్రాండ్లకు చెందిన మార్ట్‌లలో నిల్వ ఉంచిన కూరగాయలు, పండ్లు, ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత, నిల్వ విధానాలను క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీల్లో సుమారు 600 కిలోలకు పైగా నిల్వ ఉంచిన కూరగాయలను అధికారులు గుర్తించినట్లు తెలిపారు. వాటి నాణ్యత, నిల్వ ప్రమాణాలకు సంబంధించిన వివరాలను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆహార పదార్థాల నిల్వ, విక్రయాల్లో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని మార్ట్ యాజమాన్యాలకు అధికారులు హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నగరంలో ఇలాంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఆరోగ్యాధికారి డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి తెలిపారు.
ప్రముఖ మార్ట్ లలో కుళ్లిన కూరగాయలు, పండ్లు
4 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 25, 2026, 05:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)