ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విజయనగరం జిల్లాలోని మండిరవలస మాంగనీస్ బ్లాక్‌కు సంబంధించిన 300 హెక్టార్ల విస్తీర్ణంలో లైసెన్స్‌ను విన్మిర్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతేడాది మే 16న నిర్వహించిన ఇ-వేలంలో విన్మిర్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ 27 శాతం అత్యధిక బిడ్‌తో ప్రాధాన్య బిడ్డర్‌గా ఎంపికైందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అనంతరం ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ చేసిందని, ప్రాస్పెక్టింగ్ స్కీమ్‌తో పాటు అవసరమైన అఫిడవిట్‌ను సంస్థ సమర్పించిందని తెలిపారు. పట్టా భూములు, డికెటి భూముల్లో అన్వేషణ కార్యకలాపాలు ప్రారంభించే ముందు సంబంధిత భూయజమానుల అనుమతి తప్పనిసరిగా తీసుకుంటామని సంస్థ హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, ఖనిజాల వేలం నిబంధనల ప్రకారం, అన్ని చట్టబద్ధ నిబంధనలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి కాంపోజిట్ లైసెన్స్ మంజూరు చేస్తూ ప్రభుత్వం అనుమతినిచ్చింది. పట్టాదారుల అనుమతులు పొందిన తర్వాతే అన్వేషణ కార్యకలాపాలు చేపట్టాలని, అలాగే అన్ని నిబంధనలు పాటిస్తున్నట్లు నిర్ధారించుకుని తదుపరి చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Print Edition300 హెక్టార్ల మాంగనీస్ బ్లాక్‌కు లైసెన్స్
-220 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 30, 2026, 04:00 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)