ప్రజాశక్తి-నాయుడుపేట (తిరుపతి) : రోడ్డు క్రాస్ చేస్తున్న టాటా మ్యాజిక్ వాహనం, బైక్ పై వస్తున్న ఇద్దరు యువకులను ఢీకొట్టడంతో యువకులు తీవ్రగాయాల పాలైన ఘటన బిరదవాడ వద్ద చెన్నై నెల్లూరు హైవేపై శనివారం చోటు చేసుకుంది. నాయుడుపేట మండలం బిరదవాడ సమీపంలో ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. దొరవారి సత్రం మండలం తనియాల గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు బైక్‌పై (AP39 CT 8480) నాయుడుపేట వైపు వెళ్తుండగా, నాయుడుపేట నుంచి బిరదవాడ గ్రామంలోకి క్రాస్ అవుతున్న టాటా ఏసీ వ్యాన్ వారి బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రహదారిపై పడి ఉన్న యువకులను స్థానికుల సమాచారంతో 108 అంబులెన్స్ సిబ్బంది నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది
బైక్ ను ఢీకొట్టిన టాటా మ్యాజిక్ వాహనం - ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 28, 2026, 04:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)