ప్రజాశక్తి- చంద్రగిరి : తిరుపతి జిల్లా,చంద్రగిరి మండలం, శ్రీనివాసమంగాపురంలోని వసుకోటి ఎల్లమ్మ దేవాలయంలో చోరీ జరిగింది. ఆలయం వెనుక నుంచి లోపలికి ప్రవేశించిన దుండగులు గేటు తాళాలు పగులగొట్టి, సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. గత కొన్నేళ్లుగా లెక్కించని హుండీని పగులగొట్టి నగదు ఎత్తుకెళ్లారు. అమ్మవారి విగ్రహం మెడలో ఉన్న 11 గ్రాముల బంగారు పుస్తెలతాడుతోపాటు ఆలయంలో ఉన్న మినరల్ వాటర్ కాయిన్ బాక్స్‌ను కూడా మాయం చేశారు. గురువారం ఉదయం ఆలయానికి వచ్చిన అర్చకులు చోరీ విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. సుమారు రూ.5 లక్షల నగదు, బంగారం, వస్తువులు చోరీకి గురైనట్లు సమాచారం.
శ్రీనివాస మంగాపురంలోని ఎల్లమ్మ దేవాలయంలో చోరీ
16 జులై, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 16, 2026, 03:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)