శనివారం, 15 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న టిప్పర్....వృద్ధుడు మృతి

1 గంట క్రితం

tirupati
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 15, 2026, 04:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - రామచంద్రాపురం : మండలంలోని కూపుచంద్రపేట వద్ద తిరుపతి-- పచ్చికాపలం రహదారిపై ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ ఢీ కొట్టిన ప్రమాదంలో ద్విచక్ర వాహన చోదకుడు ఎన్ అల్లయ్య (63) అక్కడికక్కడే మృతి చెందారు. శనివారం తిరుపతి టౌన్‌లోని గణపతి నగర్, ప్లాట్ నెం.43లో నివాసం ఉంటున్న ఎన్. అల్లయ్య, తన పని నిమిత్తం తిరుపతి నుండి పచ్చికాపలం వైపు ఏపీ 03 బీపీ 3915 నంబరు గల యమహా ద్విచక్ర వాహనంపై వస్తుండగా. అదే రోడ్డు మార్గంలో ద్విచక్ర వాహనానికి వెనుక వైపు వస్తున్న , ఏపీ 39 యు ఎక్స్ 3906 నంబరు గల టిప్పర్ వేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం రోడ్డుకు దూరంగా పడింది ఎన్. అల్లయ్య తలకు తీవ్ర గాయమై రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఎస్సై భక్తవత్సలం తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భక్తవత్సలం తెలిపారు . మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం శ్రీ వెంకటేశ్వర మెడికల్ కళాశాలకు తరలించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్