గురువారం, 16 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

సూళ్లూరుపేటలో నిద్రలోనే కన్నుమూసిన గుర్తుతెలియని వ్యక్తి

1 గంట క్రితం

tirupati
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 16, 2026, 11:46 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - సూళ్లూరుపేట రూరల్ : సూళ్లూరు పేట రైల్వే స్టేషన్ రోడ్డులో ఛాంపియన్ స్కూల్ సమీపంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందారు. మృతుడు రాత్రిపూట స్కూల్ సమీపంలోనే ఆ వ్యక్తి నిద్రిస్తుంటారని పేర్కొన్నారు. బుధవారం రాత్రి నిద్రలోనే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఉదయాన్నే అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని వివరాలు సేకరించేందుకు స్థానికులను పోలీసులు ఆరా తీసి యాచకుడిగా గుర్తించారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్