గురువారం, 20 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

అమరావతి ఛాంపియన్షిప్ రాష్ట్రస్థాయి పోటీల గోడ పత్రిక ఆవిష్కరణ

1 గంట క్రితం

tiripati
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 20, 2026, 02:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- తిరుపతి సిటీ : తిరుపతిలోని శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో గురువారం నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో శాప్ చైర్మన్ రవి నాయుడు అమరావతి ఛాంపియన్షిప్ - 2026 రాష్ట్రస్థాయి పోటీలకు సంబంధించి గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత సంవత్సరం 10 క్రీడాంశాల్లో అండర్-22 విభాగంలో క్రీడా పోటీలను నిర్వహించామని అన్నారు. ఈ సంవత్సరం అమరావతి ఛాంపియన్‌షిప్ ను మొత్తం 12 క్రీడాంశాల్లో అండర్-17, అండర్-23 విభాగాల్లో పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఛాంపియన్‌షిప్‌లో సుమారు 2 లక్షల మంది క్రీడాకారులు భాగస్వామ్యం కావడం రాష్ట్ర క్రీడా రంగంలో ఒక విశేషమైన ముందడుగు అని పేర్కొన్నారు. అలాగే, ఈ నెల 24వ తేదీ నుంచి 27వ తేదీ వరకు తిరుపతిలో రాష్ట్రస్థాయి పోటీలను నిర్వహించనున్నట్లు శాప్ చైర్మన్ తెలిపారు. ఈ ఛాంపియన్షిప్ ను విజయవంతంగా నిర్వహించేందుకు క్రీడాకారులకు అవసరమైన మౌలిక వసతులు, వసతి, క్రీడా వేదికలు తదితర అన్ని ఏర్పాట్లను సమగ్రంగా చేపడుతున్నామని రవి నాయుడు వెల్లడించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్