ప్రజాశక్తి - రాజమహేంద్రవరం : నగరపాలక సంస్థ పరిధిలో ఇన్ ప్రిన్సిపుల్ లేఅవుట్ ప్యాట్రన్ (ఐపిఎల్పీ) ప్రక్రియ పూర్తయిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను నిర్దేశిత గడువులోగా క్లియర్ చేయాలని కమిషనర్ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు. గురువారం నగరంలోని గాదాలమ్మనగర్లో పట్టణ ప్రణాళిక అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో ఐపిఎల్పీలను తనిఖీ చేసి, పెండింగ్‌లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను స్వయంగా పరిశీలించి, వాటి పురోగతిపై ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నిర్దేశిత ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా లేఅవుట్లలో ఓపెన్ స్పేస్, ఎమినిటీస్, డ్రెయిన్లు మరియు రోడ్ల వెడల్పును క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రతి దరఖాస్తును అత్యంత జాగ్రత్తగా పరిశీలించి, ఏవైనా లోపాలు లేదా అభ్యంతరాలు ఉంటే.. వాటిని స్పష్టమైన వివరాలతో రిమార్క్స్ నోట్ చేసి తదుపరి అనుమతుల కోసం పంపాలని స్పష్టం చేశారు. అదేవిధంగా దరఖాస్తుల పరిష్కార ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని, ఎక్కడా జాప్యానికి తావు ఉండకూడదని హెచ్చరించారు. దరఖాస్తులను క్రమబద్ధీకరించే క్రమంలో ‘ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్’ (ముందు వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యత) విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట సిటీ ప్లానర్ జి.వి.ఎస్.ఎన్.మూర్తి, ఏసీపీ కొండలరావు, ఇతర టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఉన్నారు.
ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలి : కమిషనర్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 20, 2026, 03:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)