ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రాష్ట్ర గర్ల్స్ కన్వెన్షన్‌‌ను జయప్రదం చేయండి

6 రోజుల క్రితం

రాష్ట్ర గర్ల్స్ కన్వెన్షన్‌‌ను జయప్రదం చేయండి
- డిసెంబర్‌ 12, 13 తేదీల్లో నిర్వహణ : ఎస్‌ఎఫ్‌ఐ
- లోగో ఆవిష్కరణ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026, 07:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- డిసెంబర్‌ 12, 13 తేదీల్లో నిర్వహణ : ఎస్‌ఎఫ్‌ఐ

ప్రజాశక్తి - మంగళం (తిరుపతి) : తిరుపతిలో డిసెంబర్‌ 12, 13 తేదీల్లో నిర్వహించనున్న ఎస్‌ఎఫ్‌ఐ ఎపి రాష్ట్ర గర్ల్స్ కన్వెన్షన్‌‌ను విద్యార్థినులు, ప్రజాస్వామికవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ కోరింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్‌‌లో కలెక్టర్‌ ‌డాక్టర్‌ ఎస్‌ ‌వెంకటేశ్వర్లు లోగోను ఆవిష్కరించారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు రవి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థినులు ఎదుర్కొంటున్న విద్యాపరమైన సమస్యలు, మహిళలపై పెరుగుతున్న దాడులు, విద్యాసంస్థల్లో భద్రతా లోపాలు, హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కొరత వంటి అంశాలపై కన్వెన్షన్‌లో విస్తృతంగా చర్చించనున్నట్లు తెలిపారు. ఈ కన్వెన్షన్‌‌లో ఎస్ఎఫ్ఐ అఖిల భారత ఉపాధ్యక్షులు, జవహర్‌‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షులు ఐసి గోష్, అఖిల భారత సహ కార్యదర్శి శిల్పా పాల్గొంటారని తెలిపారు. విద్యార్థినులకు నాణ్యమైన విద్య, సమాన అవకాశాలు, సామాజిక న్యాయం, సమానత్వం, తగిన రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి, విద్యార్థినుల హక్కుల సాధనకు భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను రూపొందించనున్నట్లు తెలిపారు. ఎస్ఎఫ్ఐ తిరుపతి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పవిత్ర, అక్బర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని విద్యారంగ సమస్యలు, విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాలు, ప్రభుత్వ వైఫల్యాలపై సమగ్రంగా చర్చించి, విద్యార్థుల హక్కుల పరిరక్షణకు కార్యాచరణ రూపొందించడమే ఈ కన్వెన్షన్ ప్రధాన లక్ష్యమని, ఈ కన్వెన్షన్‌కు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 300 మంది విద్యార్థినులు హాజరుకానున్నారని తెలిపారు. ​ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శులు లతీఫ్, తేజ, సునీత, అనిత, యూనివర్సిటీ కమిటీ సభ్యులు లావణ్య, మేఘన, నవ్య, దీపిక తదితరులు పాల్గొన్నారు.

​

​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్