ప్రజాశక్తి -మధురవాడ,
గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ (గీతం) విద్యాలయ స్థాపనకు డాక్టర్ ఎంవివిఎస్.మూర్తికి మహత్మాగాంధీ స్ఫూర్తి అని గీతం అధ్యక్షుడు, విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్ అన్నారు. శుక్రవారం గీతం వర్సిటీలో డాక్టర్ మూర్తి వర్ధంతిని పురస్కరించుకుని డాక్టర్ మూర్తి స్మృతివనం వద్ద ఆయన విగ్రహానికి ఘననివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి పారిశ్రామిక,రాజకీయ, విద్యారంగాలలో డాక్టర్ ఎంవివిఎస్.మూర్తి తనదైన ముద్ర వేశారన్నారు. జీవితంలో జయాపజయాలను సమంగా స్వీకరించడం, అంకితభావం, కష్టపడే తత్వం డాక్టర్ మూర్తి నుంచి నేర్చుకోవలసిన విషయాలన్నారు. కార్యక్రమంలో గీతం ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం..గంగాధరరావు, గీతం కార్యదర్శి ఎమ్.భరద్వాజ, గీతం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డి.గుణశేఖరన్, సలహదారు ప్రొఫెసర్ జి.సూర్యనారాయణ, వివిధ కళాశాలల డీన్‌లు, ప్రిన్సిపాల్స్, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)