శనివారం, 10 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు చిట్టివలస విద్యార్థులు

10 గంటల క్రితం

రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు చిట్టివలస విద్యార్థులు image 1

రాష్ట్ర స్థాయి ఫుట్ బాల్ పోటీలకు ఎంపికైన విద్యార్థులతో ఫిజికల్ డైరెక్టర్ అచ్యుత రావు

వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026, 05:58 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

చిట్టివలస:

రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు తమ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఎంపికైనట్లు చిట్టివలస జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం, దొడ్డి ఆదినారాయణ, ఫిజికల్ డైరెకర్లు వి.అచ్యుతరావు, బి.అప్పలరాజు శనివారం తెలిపారు. టెన్త్ విద్యార్థిని బి.అస్మిత ఈ నెల 9న భీమిలిలో జరిగిన జిల్లా స్థాయి ఫుట్ బాల్ పోటీల్లో పాల్గొని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. ఈ నెల 11 నుంచి 13 వరకు రాజమహేంద్ర వరం ఎస్‌కెవిటి ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రాంగణంలో జరుగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో అస్మిత పాల్గొంటారని వివరించారు. ఏడో తరగతి విద్యార్థి ఆర్ శ్రావణ్ కుమార్, 8వ తరగతి విద్యార్థి బి.రోషన్‌రాజు కోటవురట్ల జెడ్పీ హైస్కూల్లో 14 ఏళ్ల బాలుర విభాగంలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు.

ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు పోలవరంలో జరుగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని పేర్కొన్నారు. వీరిని పాఠశాలలో హెచ్ఎం, ఫిజికల్ డైరెకర్లు అభినందించారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్