శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నామినేషన్ల కోలాహాలం

22 అక్టోబర్, 2026

నామినేషన్ల కోలాహాలం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 22, 2026, 07:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

నక్కపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎల్ బి ఎస్ వర్ధన్ ఆధ్వర్యంలో ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి రెండవ రోజు గురువారం నామినేషన్ల స్వీకరణ చేపట్టారు. రెండవ రోజు 65 నామినేషన్లు దాఖలైనట్లు ఆర్ఒ వర్ధన్ వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ 18, వైసీపీ 32, జనసేన 9 , ఇండిపెండెంట్ లు 6 నామినేషన్ లో దాఖలైనట్లు ఆర్ఓ తెలిపారు.మండలంలోని పలు గ్రామాల నుండి ఎంపీటీసీ పోటీలో బరిలో నిలిచిన అభ్యర్థులు ఆయా పార్టీలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుచరులతో కలిసి బైకులు, ఆటోలపై నామినేషన్ సమర్పించేందుకు మండల పరిషత్ కార్యాలయానికి తరలివచ్చారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద నామినేషన్ల కోలాహలం కనిపించింది.ఈ కార్యక్రమంలో ఏ ఆర్ ఓ కె చలపతిరావు, మండల పరిషత్ కార్యాలయ ఏఓ సీతారామరాజు పాల్గొన్నారు.

​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్