శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఫ్యాన్‌ గుర్తుపై ఓటేసి విశాఖను కాపాడండి : కెకె.రాజు

24 అక్టోబర్, 2026

ఫ్యాన్‌ గుర్తుపై ఓటేసి విశాఖను కాపాడండి  : కెకె.రాజు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 24, 2026, 09:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

జివిఎంసి ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి వైసిపి అభ్యర్థులను గెలిపించి విశాఖ నగరాన్ని కాపాడుకోవాలని ఆ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కెకె.రాజు, మేయర్‌ అభ్యర్థి వరుదు కల్యాణి ఓటర్లను కోరారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని సీతమ్మధార రైతుబజార్‌ వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 52వ వార్డు వైసిపి కార్పొరేటర్‌ అభ్యర్థి సాడి పద్మరెడ్డి, 53వ వార్డు అభ్యర్థి సాసుపల్లి రాజకుమారికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. నగరంలోని ప్రజా సమస్యలను పరిష్కరించడంతోపాటు విశాఖ అభివృద్ధికి తమ పార్టీ అభ్యర్థులకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో నాయకులు రవిరాజు, సతీష్‌ వర్మ, కెవి.బాబా, గుంటూరు నరసింహమూర్తి, పేర్ల విజయ్‌ చంద్ర, అల్లంపల్లి రాజబాబు, తాడి జగన్నాథరెడ్డి, కర్రీ మురళీకృష్ణరెడ్డి, అశోక్‌రెడ్డి, బల్ల శ్రీను, బోణి అప్పారావు, కె. సుశీలతో పాటు 52, 53వ వార్డులకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఉత్తర నియోజకవర్గంలోని 46, 47వ వార్డుల బూత్‌ కమిటీ సమావేశాల్లో కెకె.రాజు పాల్గొన్నారు. రైల్వే న్యూ కాలనీలోని గౌరీ కల్యాణ మండపంలో నిర్వహించిన సమావేశంలో 46వ వార్డు అభ్యర్థి నూనెల పోలారావు లావణ్య, 47వ వార్డు అభ్యర్థి మళ్లా విశాలాక్షి శ్రీదేవిని గెలిపించాలని బూత్‌ కమిటీ సభ్యులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జక్కంపూడి సత్యనారాయణ, దుప్పలపూడి శ్రీను, బొడ్డేటి గంగమహేష్‌, ఎడ్ల శ్రీనివాసరెడ్డి, పద్మశేఖర్‌, తిరుపతిరావు, అంబటి శైలేష్‌ తదితరులు పాల్గొన్నారు. అక్కయ్యపాలెం రామచంద్రనగర్‌ సమీపంలోని 48వ వార్డు వైసిపి కార్యాలయంలో నిర్వహించిన బూత్‌ కమిటీ సమావేశంలో కెకె.రాజు పాల్గొని, ఆ వార్డు అభ్యర్థి కర్రి రామారెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి, నీలి రవి, సీనియర్‌ నాయకులు పారుపల్లి రవి, మౌలికరెడ్డి, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

​

​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్