శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం.....

26 అక్టోబర్, 2026

పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 26, 2026, 06:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి -పాయకరావుపేట

దేశ రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని పాయకరావుపేట సీఐ వినోద్ బాబు అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సోమవారం స్థానిక శ్రీ ప్రకాష్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ‘సమాజ నిర్మాణంలో పోలీసుల పాత్ర...అమరవీరుల త్యాగాలు’ అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించి, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్థులు పాయకరావుపేట పోలీస్ స్టేషన్‌ను సందర్శించగా, పోలీసుల విధులు, ఎఫ్‌ఐఆర్ నమోదు ప్రక్రియ, ఆయుధాల వినియోగం, వైర్‌లెస్ వ్యవస్థ, మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, డయల్ 112 సేవలపై సీఐ వినోద్ బాబు, ఎస్సైలు పురుషోత్తం, సన్యాసిరావు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్