శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

క్విజ్‌ పోటీలో ‘ప్రకాష్‌’ విద్యార్థుల ప్రతిభ

26 అక్టోబర్, 2026

క్విజ్‌ పోటీలో ‘ప్రకాష్‌’ విద్యార్థుల ప్రతిభ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 26, 2026, 06:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి -పాయకరావుపేట

భారత్ వికాస్ పరిషత్ విశాఖపట్నం ప్రాంత్ ఆధ్వర్యంలో ఈ నెల 25న శ్రీ ప్రకాష్ విద్యాసంస్థల్లో నిర్వహించిన ‘భారత్ కో జానో’ క్విజ్ పోటీల్లో శ్రీ ప్రకాష్ విద్యానికేతన్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. జూనియర్స్ విభాగంలో 8వ తరగతి విద్యార్థి కె. హేమంత్ రాజా, కె. రేవంత్ ఈశ్వర్ మారుతి ప్రథమ స్థానం సాధించి ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను అందుకున్నారు. వచ్చేనెల 29న విజయవాడలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి క్విజ్ పోటీలకు ఎంపికయ్యారని శ్రీ ప్రకాష్ విద్యానికేతన్ ప్రధానోపాధ్యాయులు డి.వి. శ్రీనివాస్ తెలిపారు. ఈ పోటీల్లో విజయవాడ నుంచి విశాఖపట్నం వరకు వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను విద్యాసంస్థల అధినేత సి.హెచ్.సి.కె. నరసింహారావు, సంయుక్త కార్యదర్శి సి.హెచ్. విజయ్ ప్రకాష్, సీనియర్ ప్రిన్సిపాల్ ఎంవివిఎస్. మూర్తి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ విద్యార్థులు విజయం సాధించాలని ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్