సోమవారం, 10 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

డీఎస్సీ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపాలి

4 రోజుల క్రితం

protest
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 06, 2026, 10:52 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి

- వైసిపి డిమాండ్

- రిలే నిరాహారదీక్షలు ప్రారంభం

ప్రజాశక్తి..విజయనగరం టౌన్ : డీఎస్సీ కూటమి ప్రభుత్వం చేసిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి అందుకు బాధ్యులైన విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి కోలగట్ల శ్రావణి, యువజన విభాగం నాయకులు ఈశ్వర్ కౌశిక్,పార్టీ నగర అధ్యక్షులు ఆశపు వేణు డిమాండ్ చేశారు.డీఎస్సీ అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ వైసీపీ యువజన,విద్యార్ది విభాగాలు ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రిలే నిరాహారదీక్షలు గురువారం చేపట్టారు. దీక్షలను ఉద్దేశించి వారు మాట్లాడుతూ రాష్ట్రంలో యువకులను కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. పార్టీని నమ్ముకుంటే ప్రభుత్వం ఉద్యోగం గ్యారెంటీ అనే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. డీఎస్సీలో మెరిట్ లేని వారికి క్రీడా కోటాలో డీఎస్సీ ఉద్యోగాలు ఇవ్వడమే అందుకు నిదర్శనమన్నారు. జాతీయ స్థాయిలో రాణించి, టెట్ లో ఉత్తీర్ణులైన వారికి కాదని ఎటువంటి ప్రతిభ లేని వారికి అనేక మందికి క్రీడా కోటాలో డీఎస్సీ నియామకాలు కూటమి ప్రభుత్వం చేపట్టిందన్నారు. మరో వైపు నిరుద్యోగ భృతి అన్నారు నేటి వరకు ఇవ్వలేదన్నారు. నిరుద్యోగ యువత కు తీవ్ర అన్యాయం కూటమి ప్రభుత్వం చేస్తుందన్నారు. తక్షణమే డీఎస్సీ లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ లో జరిగిన అక్రమాలకు కారణమైన విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలనీ అంత వరకు పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. రిలే నిరాహారదీక్షలో యువకులు, పార్టీ నాయకులు ఎస్ వి వి రాజేష్, మాజీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్