- మంత్రి కొండపల్లి శ్రీనివాస్
ప్రజాశక్తి-విజయనగరం కోట: ఆంధ్రప్రదేశ్ పేరును ప్రపంచ బ్రాండ్లో నిలబెట్టిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని రాష్ట్ర ఎన్ఆర్ఐ ఎస్ఎంఎస్ సి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కొనియాడారు. ఆదివారం తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా యువత ఉద్యోగాల కోసం ఇంత చొరవ తీసుకోలేదన్నారు.ముఖ్యమంత్రి విశాఖపట్నానికి ఒక బ్రాండ్ తీసుకొని వచ్చారు. విశాఖపట్నానికి ఎక్కువ ఐటీ కంపెనీలు తీసుకొని వచ్చామన్నారు- యువగళంలో మంత్రి నారా లోకేష్ ఇచ్చిన మాట ప్రకారం 20 లక్షల ఉద్యోగాలకు కార్యాచరణ చేస్తున్నామన్నారు. రూ. 3,800 కోట్లతో ప్రతి ప్రాంతానికి బల్క్ ఇండస్ట్రీలకు కేటాయించారన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంయు పార్కులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆ ప్రాంతంలో ఉన్న యువత అదే ప్రాంతంలో ఉద్యోగాలు చేసుకునే విధంగా ఉపాధి కల్పించటమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామన్నారు. గడిచిన 3 నెలల నుంచి 5 దేశాల్లో మన రాష్ట్రానికి పెట్టుబడుల కోసం ప్రచారం చేస్తూ ముందుకు వెళ్లాము- ఇప్పటికే రూ. 33 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్నారు.స్పేస్ రిలేటెడ్ కంపెనీలకు ప్రత్యేక స్థాయిలో అవకాశం ఇచ్చామన్నారు. ఐదు సంవత్సరాల్లో ఎయిర్‌పోర్ట్‌కు ఒక ప్రహరీ కూడా తీసుకొని రాలేకపోయారు- గతంలో రాష్ట్రానికి వచ్చిన ఒక్క కంపెనీని కూడా నిలుపుకోలేకపోయారు. శ్రీకాకుళంలో గెయిల్, కోరమాండల్ లాంటి కంపెనీలు వచ్చాయి,బొత్స సత్యనారాయణ ఏమంటున్నారో వాళ్లకే తెలియాలి, ఉత్తరాంధ్రకు ఏం చేశారు, విజయనగరం జిల్లాకు ఏం చేశారు. ఇన్నేళ్లుగా నాయకత్వం వహించారు, అసలు ఈ ప్రాంతానికి ఏం చేశారో ప్రజలందరికీ తెలుసు అన్నారు.ఓన్లీ విజయనగరం జిల్లాకే రూ. 2,700 కోట్ల పైచిలుకు పెట్టుబడులు వచ్చాయి. 31వ సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ 2026 ద్వారా 714 ప్రాజెక్టులు, రూ. 22 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు- సుమారు 19,00,000 ఉద్యోగ కల్పనకు సిద్ధమవుతున్నాం, ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోందన్నారు.








కామెంట్‌లు (0)