ప్రజాశక్తి.. విజయనగరం టౌన్ : పీఎం స్వనిధి పథకం అమలులో ఉత్తమ పనితీరును కనపరిచిన విజయనగరం నగరపాలక సంస్థకు అవార్డు లభించింది. ఈనెల 20వ తేదీన న్యూఢిల్లీలో నిర్వహించనున్న అవార్డుల ప్రదానోత్సవానికి హాజరు కావలసిందిగా కమిషనర్ బాలస్వామి, సిటీ మిషన్ మేనేజర్ సన్యాసిరావుకు ఆహ్వానాలందాయి. ఈ సందర్భంగా కమిషనర్ బాలస్వామి మంగళవారం ప్రజాశక్తితో మాట్లాడుతూ .... వీధి విక్రయదారులకు పీఎం స్వనిధి అనేది వరం లాంటిదని అన్నారు. ఎలాంటి హామీ లేకుండా వీధి విక్రయదారులకు ప్రధానమంత్రి ఆత్మ నిర్భర్ నిధి కింద రుణాలు అందజేయడం జరుగుతుందన్నారు. నగరంలో గుర్తించిన వీధి విక్రయదారులకు రుణాలు అందించడంతో పాటు వారి ఆర్థిక స్వావలంబనకు కృషి చేస్తున్నామన్నారు. ఈ పథకం అమలులో మంచి ఫలితాలు రావడంతో అవార్డు లభించడం సంతోషంగా ఉందన్నారు.
పీఎం స్వనిధి అమలులో నగర పాలక సంస్థకు అవార్డు
5 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 17, 2026, 03:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)