ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

హుదూద్ ఇళ్ళ లో కనీస మౌళిక సదుపాయాలు కల్పించాలి : సిపిఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు

1 గంట క్రితం

Basic infrastructure must be provided in Hudhud houses CPM City Secretary Reddy Shankara Rao
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 22, 2026, 02:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : విజయనగరంలో లంకాపట్నమ్ లో నిర్మించిన ఇళ్లల్లో నివాసం ఉంటున్నపేదలకి కనీస మౌళిక సదుపాయాలు కల్పించాలని సిపిఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు డిమాండ్ చేశారు. ఆదివారం ఆ ఇళ్ల సముదాయంలో నివాసం ఉంటున్న వారితో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ... ఇక్కడ మంచినీటి కుళాయిలు ఏర్పాటు చెయ్యాలని, అన్ని బ్లాకులు శుభ్రం చేసేందుకు మున్సిపల్ వర్కర్స్ ని ఏర్పాటు చెయ్యాలని, కరెంట్ మీటర్స్ అందరికీ వేయాలని, ఇల్లు కేటాయంచకుండా ఉన్న వారికి పోయిన తలుపులు, కిటికీలు ఇవ్వాలని, చట్టభద్ధంగా లబ్ది దారులు కి ఇల్లు అప్పచెప్పి న్యాయo చెయ్యాలని కోరారు.,2014 లో వచ్చిన హుదూద్ తుపాన్ కి ఇల్లు కోల్పోయిన వారికి లంకాపట్నం లో 2019 లో 480 ఇల్లు 100 కోట్లు ఖర్చుపెట్టి కట్టారు కానీ ఆ ఇల్లు లబ్ది దారులుకి అప్ప చెప్పకపోవడంతో సిపిఎం 2024 లో ఇల్లులో లబ్దిదారులుని దించింది. అనంతరం పోరాడితే కరెంట్ సౌకర్యం, ట్యాంకర్లు ద్వారా నీరు సప్లై చేస్తున్నారు. కానీ పూర్తిగా లబ్ది దారులు అందరికీ ఇల్లుఅప్పచెప్పకపోవడంతో ఇల్లు పాడైపోతున్నాయని గుర్తు చేశారు. అధికారులు స్పందించి మౌళిక సదుపాయ లు కల్పించకుంటే పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంటుందని దానికి పూర్తి భాధ్యాత అధికారులుదే నని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జగద్దాంబ. కర్రీ రమణమ్మ, తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్