ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వేపాడ శాఖా గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన

15 నవంబర్, 2026

vza-1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026, 02:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి: గ్రంథాలయ అధికారి చంద్రశేఖర్

ప్రజాశక్తి - వేపాడ : 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం వేపాడ శాఖా గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయంలో అందుబాటులో ఉన్న వివిధ రకాల పుస్తకాలను ప్రదర్శించారు. పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు, పురాణ ఇతిహాసాలు, ప్రముఖుల జీవిత చరిత్రలు తదితర పుస్తకాలను ప్రదర్శనలో ఉంచారు.ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి మోపాడ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల పోటీ పరీక్షల పుస్తకాలు గ్రంథాలయంలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు గ్రంథాలయ సేవలను సద్వినియోగం చేసుకొని, తమ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఆకాంక్షించారు. విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించడమే పుస్తక ప్రదర్శన ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్