సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

క్వారీ లారీలు రాకపోకలతో బూడిదిగా మారిన బీటీ రోడ్డు

13 సెప్టెంబర్, 2026

BT road turns into a dust bowl due to the movement of quarry lorries.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 13, 2026, 05:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-వేపాడ (విజయనగరం) : వేపాడ మండలం వీలు పరితి గ్రామ సచివాలయం పరిధిలో గల గిరిజన గ్రామాలైన కడకొండ, దుంగాడ, కొరికిపాలెం. గ్రామాలకు సుమారు రెండు కిలోమీటర్లు వీలుపరితినండి వావిలిపాడు వెళ్లే రోడ్డు మార్గము మలుపు వద్ద నుండి కడ కొండకు వేసిన రోడ్డు క్వారీ లారీలు రాకపోకలతో పూర్తిగా శిధిలమై నడవడానికి కూడా వీలుపడని విధంగా తయారైంది. గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రధానంగా గిరిజనులు ప్రతి చిన్న పనికి వేపాడ మండల కేంద్రానికి ప్రభుత్వ కార్యాలయాలకు వైద్య సేవలకు అదేవిధంగా అత్యవసర వైద్య సేవలు పొందుటకు వేపాడ రావాలంటే నరకాన్ని అనుభవించక తప్పదు. అధికారులు క్వారీ హీరింగ్ అనుమతులు పొందుటకు మీరు గ్రామాలకు రోడ్డు సౌకర్యం కనిపిస్తాము, పర్యావరణ పరిరక్షణ కాపాడుతాము, మొక్కలు నాటుదాము, వైద్య సేవలు అందిస్తాము ఏ విధమైన అసౌకర్యాలు కలుగకుండా మీకు చూస్తామని చెబుతారు చెప్పిన మాటల్లో ఒక్క మాట కూడా అమలు జరిగిన దాఖలాలు లేవు ప్రభుత్వ అధికారుల ఈ విధంగా వ్యవహరిస్తే గిరిజనులకు రహదారి సౌకర్యం మెరుగుపరిచేది ఎవరు అంటున్నారు పలువురు గిరిజనులు జిల్లా అధికారులు, క్వారీ యజమానులు స్పందించి రోడ్డు బాగు చేయుటకు చర్యలు తీసుకోకపోతే మండల కేంద్రంలోనూ జిల్లా కేంద్రంలోనూ నిరసన చేయక తప్పదని గిరిజన మహిళలు యువకులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్