అనుసంధానిత డిజిటల్ క్యాంపస్ దిశగా విద్యార్థుల ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న వినూత్న వేదిక
ప్రజాశక్తి.. విజయనగరం టౌన్ : జె ఎన్ టి యు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, విజయనగరంలో సెంట్రలైజెడ్ అకడమిక్ ప్లాట్ఫారం ను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. విద్యార్థుల అకాడమిక్ కార్యకలాపాలు, పరీక్షలు, పరిపాలనా ప్రక్రియలు, కమ్యూనికేషన్ మరియు వివిధ సంస్థాగత సేవలను ఒకే అనుసంధానిత డిజిటల్ వేదికపైకి తీసుకురావడం ఈ ప్లాట్‌ఫారమ్ ప్రధాన ఉద్దేశ్యం. శుక్రవారం జె ఎన్ టి యు ఆడిటోరియంలో వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.వి. సుబ్బారావు కాప్ ను అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్, ప్రిన్సిపాల్, వైస్-ప్రిన్సిపాల్, డైరెక్టర్లు, విభాగాధిపతులు, పరిపాలనా అధికారులు, అధ్యాపకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. కాప్ కేవలం ఒక వెబ్‌సైట్ లేదా యాప్ మాత్రమే కాదు. ఇది విద్యాసంస్థలోని వివిధ అకాడమిక్, పరిపాలనా మరియు సంస్థాగత ప్రక్రియలను ఒకదానితో ఒకటి అనుసంధానించే సమగ్ర డిజిటల్ వ్యవస్థ అన్నారు. 29కి పైగా అనుసంధానిత మాడ్యూల్స్ ద్వారా అకాడమిక్ ఆపరేషన్స్, పరీక్షలు & ఫలితాలు, హాజరు & అర్హత, ఫారాలు & ఫీడ్‌బ్యాక్, కమ్యూనికేషన్, డాక్యుమెంట్లు & సర్టిఫికెట్లు, చెల్లింపులు, పోర్ట్‌ఫోలియోలు, ఈవెంట్స్ & క్లబ్‌లు, సంస్థాగత సమాచారం, వెరిఫికేషన్ మరియు మొబైల్ యాక్సెస్ వంటి విభాగాలను అనుసంధానించారు. విద్యార్థి హాజరు పరీక్షా అర్హతతో, అర్హత పరీక్షా దరఖాస్తుతో, పరీక్షలు ఫలితాలతో, ఫలితాలు అకాడమిక్ డాక్యుమెంట్లతో, డాక్యుమెంట్లు సర్టిఫికెట్లతో అనుసంధానమవుతాయన్నారు.దీని ద్వారా సెమిస్టర్ పరీక్షలు, పరీక్షల షెడ్యూల్స్, పరీక్షా దరఖాస్తులు, సబ్జెక్ట్ అప్లికేషన్లు, ఎలిజిబిలిటీ చెక్స్, పరీక్షా ఫీజులు, హాల్ అలొకేషన్, హాల్ టికెట్లు, డి ఫార్మ్స్, సప్లిమెంటరీ పరీక్షలు మరియు రీవాల్యుయేషన్ వంటి ప్రక్రియలకు మద్దతు లభిస్తుందన్నారు. కాప్ ద్వారా హాల్ టికెట్లు, మార్క్స్ మెమోలు, సర్టిఫికెట్లు, ID కార్డులు, సర్క్యులర్లు మరియు ఇతర సంస్థాగత రికార్డులు వంటి డిజిటల్ డాక్యుమెంట్లను రూపొందించి నిర్వహించవచ్చునన్నారు. అకాడమిక్ రికార్డులతో పాటు విద్యార్థుల ఈవెంట్లు, క్లబ్‌లు, కో-కరిక్యులర్ కార్యకలాపాలు మరియు ఇతర విజయాలను నమోదు చేయడానికి స్టూడెంట్ ప్రొఫైల్ సదుపాయం కూడా ఉందన్నారు. విద్యార్థుల ప్రతిభ, అధ్యాపకుల మార్గదర్శకత్వం, సాంకేతిక సహకారం కలిసిన సమిష్టి కృషికి కాప్ ఒక చక్కటి ప్రతీకగా నిలిచిందన్నారు.








కామెంట్‌లు (0)