సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజుని కలిసిన చిన్న శ్రీను

13 సెప్టెంబర్, 2026

Chinna Srinu met Goa Governor Ashok Gajapathi Raju.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 13, 2026, 04:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : తెలుగుదేశం పార్టీలో చేరిన అనంతరం ఉమ్మడి విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్ శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు ని గోవాలోని గవర్నర్ బంగ్లాలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చిన్న శ్రీను తో పాటు ఆయన కుమార్తె మజ్జి సిరి సహస్ర (సిరమ్మ) కూడా గవర్నర్ అశోక్ గజపతిరాజు గారిని కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ గారితో ఆత్మీయంగా మాట్లాడి, పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం శాసనసభ్యురాలు శ్రీమతి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు కూడా పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీలో తన కొత్త రాజకీయ ప్రయాణం నేపథ్యంలో అశోక్ గజపతిరాజు గారిని కలసి ఆయన ఆశీస్సులు తీసుకోవడం ఎంతో ఆనందంగా, గౌరవంగా ఉందని చిన్న శ్రీను గారు తెలిపారు.విజయనగరం, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి పెద్దల సూచనలు, ఆశీస్సులతో ముందుకు సాగుతానని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారు చిన్న శ్రీను గారికి, సిరి సహస్ర (సిరమ్మ) గారికి శుభాకాంక్షలు, ఆశీస్సులు అందించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్