ప్రజాశక్తి,వేపాడ: వేపాడమండలం సోంపురం గ్రామం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం శృంగవరపుకోట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ హిమగిరి. సైబర్ నేరాలపై పిల్లలకు అవగాహనా కార్య్రకమం నిర్వహించారు. సమాజంలో జరుగుతున్న నాలుగు రకాల నేరాలు, తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యత, పరీక్షల్లో విద్యార్థులు తీసుకోవలసిన జాగ్రత్తలు, విద్యార్థుల లక్ష్యసాధన, సైబర్ గేమ్స్, నైతిక ప్రవర్తన, సంబందిత నీతి కథలతో 6 నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 10వ తరగతి విద్యార్థులతో ముఖాముఖితో ఆద్యంతం ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగిన ఈ కార్యక్రమంలో వల్లం పూడి పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ చల్లా శేషాద్రి, కానిస్టేబుల్ నాయుడు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి పి ఏ రాజు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
సోంపురం జడ్పీ హైస్కూల్లో సైబర్ నేరాల పై అవగాహన సదస్సు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 28, 2026, 03:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)