ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు, వైన్‌షాప్‌ తొలగించాలని దళితుల నిరసన

1 రోజు క్రితం

ji bheam.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026, 01:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌: విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని 60వ డివిజన్‌ గాజులరేగ ఆచంట నగర్‌లో ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు, వైన్‌షాప్‌ ఏర్పాటును నిరసిస్తూ స్థానిక దళిత బాధితులు, ప్రజాసంఘాల నాయకులు శనివారం నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట శాంతియుతంగా బైఠాయించి నిరసన చేపట్టారు. ఆచంట నగర్‌ సర్వే నంబర్‌ 70-1లోని 1.54 ఎకరాల ప్రభుత్వ/దళితుల భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టడంతోపాటు వైన్‌షాప్‌ ఏర్పాటు చేయడాన్ని వారు వ్యతిరేకించారు. అనంతరం నగరపాలక సంస్థ కమిషనర్‌ను కలిసి అక్రమ నిర్మాణాలను తొలగించాలని, వైన్‌షాప్‌ నిర్వహణపై విచారణ జరపాలని వినతిపత్రం అందజేశారు. విధి నిర్వహణలో ఉన్న ఎస్సీ వార్డు ప్లానింగ్‌ సెక్రటరీపై దౌర్జన్యానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై కమిషనర్‌ సానుకూలంగా స్పందించినట్లు ప్రజాసంఘాల నాయకులు తెలిపారు. సంబంధిత ప్లానింగ్‌ సిబ్బంది సోమవారం లోపు చర్యలు తీసుకోవాలని, అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు వెల్లడించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్