సోమవారం, 27 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

తోపుడుబండ్ల వ్యాపారుల పొట్టకొట్టొద్దు

1 గంట క్రితం

వాజ్మ్
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 27, 2026, 10:24 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- నగర పాలక అధికారులు తీరు మార్చుకోవాలి

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఆగస్టు 1న భోగాపురం విమానాశ్రయం ప్రారంభానికి ప్రధానమంత్రి పర్యటన నేపద్యంలో తోపుడుబండ్లు వారని వారం రోజులుగా మూసేమని నగర పాలక సంస్థ అధికారులు చెప్పడాన్ని సిపిఎం తీవ్రణగా ఖండిస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ తెలిపారు. సోమవారం స్థానిక ఎల్ బి జి భవనం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆగస్టు 1న ప్రధాన మంత్రి పర్యటన నేపధ్యంలో విజయనగరం పట్టణంలో ఫుట్పాత్ వ్యాపారులను వారం రోజుకు పాటు పెట్టొద్దని నగర పాలక సంస్థ అధికారులు హుకుం జారీ చేయడం సరికాదన్నారు.

ఎక్కడో భోగాపురం లో విమానాశ్రయం ప్రారంభం అయితే విజయనగరం పట్టణంలో పొట్టకూటి కోసం వ్యాపారాలు చేసుకుంటున్న పుట్ట్పాత్ వ్యాపారులు పొట్టకొట్టడం నగర పాలక సంస్థ అధికారులు తీరును దారుణమన్నారు. ఉపాధి లేకపోవడం వలన వ్యాపారాల చేసుకొని జీవనం సాగిస్తున్న వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు ఉపాధి కల్పించాల్సిన అధికారులు ఈ విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. వారం రోజులు పాటు వీధి విక్రయదారులు వ్యాపారాలు చేసుకోకపోతే ఎలా బతకాలని ప్రశ్నించారు. వడ్డీకి అప్పులు చేసి పుట్ట్పాత్ వ్యాపారాలు చేసుకున్న వారికి వారం రోజులు డబ్బులు చెల్లించి ఆదుకుంటారా అని నగర పాలక సంస్థ అధికారులు ను ప్రశ్నించారు. అప్పులు చేసి బళ్ళు పెట్టుకొని జీవిస్తున పేదలు మీద వారి పొట్టకొట్టే పని చేయడం దుర్మార్గమన్నారు. ఎప్పుడో ఆగస్టు 1 తేదీన ప్రధాని మంత్రి వస్తే వారం రోజులు పాటు వ్యాపారాలు చేయొద్దని చెప్పడం ఇదేనా మీ పాలన అని ప్రశ్నించారు.రెండున్నర గంటల ప్రధాని పర్యటన కోసం గత పది రోజులుగా ప్రభుత్వ కార్యాలయం లో ప్రజలకు సేవలు అందడం లేదన్నారు. నగర పాలక సంస్థ అధికారులు ,జిల్లా అధికారులు పూర్తిగా పాలన గాలికొదిలేసి విమానాశ్రయం చుట్టూ తిరుగుతున్నారు తప్ప ప్రజలు బాధలు పట్టడం లేదన్నారు. విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధం చేస్తున్నారు మరి అక్కడ భూములిచ్చిన రైతులకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో.ప్రకటించాలని డిమాండ్ చేశారు. వెంటనే పుట్పాత్ వ్యాపారులను వారి వ్యాపారాలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని లేకుంటే వ్యాపారులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.విలేకర్ల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రెడ్డి శంకరరావు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్