సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బాలికల వసతి గృహమును సందర్శించిన ఉపాధి హామీ పీడీఎస్. శారద

5 రోజుల క్రితం

vepada
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 15, 2026, 04:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - వేపాడ : వేపాడ మండలం బక్కు నాయుడుపేట వద్ద గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల వసతి గృహమును మంగళవారం పిడిఎస్‌.శారద దేవి సందర్శించారు. పాఠశాల పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పాఠశాల ఆవరణలో అరణ్యం కార్యక్రమంలో భాగంగా మొక్కలు పెంపకానికి అవసరమైన స్థలాన్ని పరిశీలించామని అన్నారు. పాఠశాల ఆవరణలో మామిడి మొక్కలు, పనస మొక్కలు పెంపకానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం హార్టికల్చర్ లో గుమ్మడి వెంకటరావు రైతు పొలంలో నాటిన కొబ్బరి మొక్కలను పరిశీలించారు. అంతర పంటల మొక్కలు పెరుగుదల సంరక్షణ తదితర అంశాలను వాటర్ కన్జర్వేషన్ పనులు అధికంగా చేపట్టాలని సిబ్బందికి సూచించారు. ఈ పర్యటనలో ఎంపీడీవో సిహెచ్ సూర్యనారాయణ, ఏ పీ ఓ ఆదిలక్ష్మి, టెక్నికల్ అసిస్టెంట్లు, ఈసీలు, వసతి గృహం సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్