గురువారం, 10 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సీతారాం ఏచూరి స్ఫూర్తి తో ప్రజాసమస్యల పై పోరాటం

1 గంట క్రితం

vzm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 10, 2026, 05:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఏచూరి వర్ధoతి సభలో సిపిఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు పిలుపు

ప్రజాశక్తి... విజయనగరం టౌన్ : సిపిఎం పూర్వ జాతీయ ప్రధాన కార్యదర్శి, పూర్వ రాజ్యసభ సభ్యులు ప్రముఖ మేధావి, పోరాటయోధుడు

సీతారామ్ ఏచూరి ద్వితీయ వర్ధంతి సభ గురువారం విజయనగరం గురజాడ నగర్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పి. రమణమ్మ అధ్యక్షత వహించారు. ముందుగా సిపిఎం నగర కార్యదర్శి రెడ్ది శంకరరావు ఏచూరి చిత్ర పటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. అనంతరం అయన మాట్లాడుతూ లౌకిక విలువలు కోసం, భారత దేశo లో సోషలిజం సాధన కోసం, జీవించినంత కాలం నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి ఉన్న మహా నేత ఏచూరి గారని అన్నారు. పార్లమెంట్ లోను బయట ప్రజా సమస్యలు పై పోరాడిన యోధుడు అని, మతోన్మాద ప్రమాదం పై రాజ్యాంగ పరిరక్షణ కోసం అలుపెరుగని పోరాటం చేసిన నేత ఏచురి అని కొనియాడారు. ప్రజాసమస్యలు పరిస్కారం కోసం,శ్రామిక రాజ్యం సాధన కోసం పోరాటం చేయడమే ఏచూరికి ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. సీతారం ఏచూరి స్ఫూర్తితో ప్రజాసమస్యలు పరిస్కారానికి పోరాడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర కమిటీ సభ్యులు రంభ శ్రీను, స్థానిక నాయకులు బండారు శ్రీను గణేష్, చంటి, వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్