ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జాతీయ జూనియర్‌ ఖోఖో పోటీలకు జిల్లా నుంచి నలుగురు క్రీడాకారుల ఎంపిక

1 రోజు క్రితం

జాతీయ జూనియర్‌ ఖోఖో పోటీలకు జిల్లా నుంచి నలుగురు క్రీడాకారుల ఎంపిక
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026, 01:23 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - విజయనగరం టౌన్‌: జాతీయ జూనియర్‌ ఖోఖో ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్‌ జట్టుకు విజయనగరం జిల్లా నుంచి నలుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ నెల 22 నుంచి గుజరాత్‌ రాష్ట్రంలోని వడోదరలో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో వీరు రాష్ట్ర జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.

ఎంపికైన క్రీడాకారుల్లో విజయనగరానికి చెందిన ఎస్‌.కె. సలీం, ఎం. శివ, గరికివలసకు చెందిన ఎం. ధనలక్ష్మి, కె. పావని ఉన్నారు. జిల్లా నుంచి నలుగురు క్రీడాకారులు జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడంపై జిల్లా ఖోఖో సంఘం చైర్మన్‌ పెనుమజ్జి విజయలక్ష్మి, అధ్యక్షులు కమలనాభారావు, కార్యదర్శి గోపాల్‌, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి మల్లికార్జునరావు హర్షం వ్యక్తం చేశారు. ఎంపికైన క్రీడాకారులకు అభినందనలు తెలియజేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్