ఆదివారం, 16 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

​జిల్లా కేంద్రంలో ఘనంగా 'హర్ ఘర్ తిరంగ' బైక్ ర్యాలీ

3 రోజుల క్రితం

tiranga
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 13, 2026, 12:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని డివిజన్ కేంద్రం విజయనగరంలో ఆర్డీవో సుధాసాగర్ ఆధ్వర్యంలో గురువారం భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. "హర్ ఘర్ తిరంగ" కార్యక్రమంలో భాగంగా, జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆదేశాలు, ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు స్థానిక అంబేద్కర్ (బాలాజీ) జంక్షన్ నుంచి మయూరి కూడలి వరకు ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్డీవో సుధాసాగర్ మాట్లాడుతూ, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా... ప్రజల్లో దేశభక్తిని, జాతీయ స్ఫూర్తిని నింపే లక్ష్యంతో తిరంగా ర్యాలీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మన భారత రాజ్యాంగం తాలూకు స్ఫూర్తిని స్మరించుకుంటూ, మంచి పౌరులుగా దేశం పట్ల మన బాధ్యతలను గుర్తుచేసుకోవడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. పట్టణంలోని ప్రధాన రోడ్ల గుండా ఉత్సాహంగా సాగిన ఈ ర్యాలీలో కేవలం ఉద్యోగులే కాకుండా, స్థానిక ప్రజలు మరియు విద్యార్థులు పెద్ద ఎత్తున భాగస్వాములయ్యారు. ఈ కార్యక్రమంలో స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు జిల్లా అధికారి రోజారాణి, తహసీల్దార్ కూర్మనాధరావు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్