- పట్టణ నిరస్రాయుల ఆశ్రమంలో అల్పాహారం భోజనం
ప్రజాశక్తి..విజయనగరం టౌన్ : జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ 34 వ వార్షికోత్సవ వేడుకలు సేవా కార్యక్రమాలతో నిర్వహించారు పట్టణ నిరస్రాయుల ఆశ్రమంలో గురువారం ఉదయం కేక్ కట్ చేసి అక్కడ ఉండే నిరాశ్రయులకు భోజనం అల్పాహారం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అవనాపు సత్యనారాయణ మాట్లాడుతూ 1993లో జాప్ పౌండర్ ఉప్పల లక్ష్మణ్ ఆధ్వర్యంలో ప్రారంభమై నేటికీ 34 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఆనందాన్ని ఇస్తుందన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలపై జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు తదితర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు జిల్లా అధ్యక్షులు మానాపురం రవిచంద్రశేఖర్ మాట్లాడుతూ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ కలెక్టర్ మరియు డీఈవోల సహాయ సహకారాలతో అమలవుతుందని తెలిపారు. జాప్ జర్నలిస్టు సమస్యలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటుందని తెలిపారు. జర్నలిస్టులకు ఏ సమస్య వచ్చినా తక్షణమే స్పందించే యూనియన్ జాప్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో జాప్ ప్రతినిధులు యాగంటి రవి, ఆదినారాయణ, కృష్ణ, శివాజీ, హేమంత్, రమేష్ కుమార్ పట్నాయక్, రామకృష్ణ నాయుడు గంగుల శివ, సురేష్, రవి, మధు రెడ్డి, లక్ష్మణ్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు








కామెంట్లు (0)