మున్సిపల్ కార్మికులపై శ్రమ దోపిడి ఆపాలి
మినిమం టైమ్ స్కేల్ ఇవ్వాలి. పర్మినెంట్ చేయాలి
యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ. జగన్ మోహన్ రావు డిమాండ్
ప్రజాశక్తి.. విజయనగరం టౌన్ : ఏపీ మున్సిపల్ వర్కర్స్ & ఎంప్లాయిస్ యూనియన్ (సి ఐ టి యు) ఆధ్వర్యంలో యూనియన్ నేతలు, కార్మికులు శనివారం గాంధీ పార్క్‌లో గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. మున్సిపల్ కార్మికులపై శ్రమ దోపిడి ఆపాలని, మినిమం టైమ్ స్కేల్ ఇవ్వాలని, పర్మినెంట్ చేయాలని, పట్టణ పౌర సేవల ప్రైవేటీకరణ జిఓలు 975, 673 లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ. జగన్ మోహన్ రావు మాట్లాడుతూ.. స్వతంత్రం వచ్చి 80 ఏళ్ళు అయినా నేటికి రాజ్యాంగ ఫలాలు అందరికీ అందటం లేదని,కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ , థర్డ్ పార్టీ, డైలీ వేజ్ పేరుతో శ్రమ దోపిడి కొనసాగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ ప్రకటించిన కనీస వేతనాలు కూడా అమలు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్ పంపు హౌస్, లీకులు, వాల్వ్ ఆపరేటర్లు, ప్లాంటేషన్, స్ట్రీట్ లైట్, నైట్ శానిటేషన్ లో థర్డ్ పార్టీ కార్మికులకు అప్కాస్ జీతాలు, లేబర్ హాలీడేస్, సిక్ & క్యాజువల్ లీవ్ లు అమలు చేయాలని కోరారు. ప్రతి నెలా 5 వ తేదీ లోపు జీతాలు ఇవ్వాలని, బకాయి జీతాలు చెల్లించాలని, ఇంజనీరింగ్ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.







కామెంట్‌లు (0)