చినగుడిపాలలో ఉచిత మెగా వైద్య శిబిరం
ప్రజాశక్తి-వేపాడ (విజయనగరం): గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో వేపాడ మండలం చినగుడిపాల గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శంకర్ వంశం బలరామ జనాదేవ్, సురేష్వరి సహకారంతో గ్రామ పెద్దలు, యువత ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రముఖ వైద్యులు పాల్గొని గ్రామ ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించారు. శిబిరంలో సాధారణ ఆరోగ్య సమస్యలతో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన రోగుల నుంచి రక్త నమూనాలను సేకరించారు. కంటి పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సమస్యలను గుర్తించారు. వైద్యుల సూచనల మేరకు అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ శిబిరంలో జనరల్ మెడిసిన్ వైద్య నిపుణులు డాక్టర్ జి.కె.డి. డేనియల్, ఎముకలు, కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ సత్య వంశీ, డాక్టర్ భార్గవి పాల్గొని రోగులకు వైద్య సేవలు అందించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించడం అభినందనీయమని గ్రామస్థులు పేర్కొంటూ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువత, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)