ప్రజాశక్తి-వేపాడ (విజయనగరం) : దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఎర్రకోట వేదికగా ఈ నెల 15న నిర్వహించనున్న 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వేపాడ మండలం బక్కునాయుడుపేట ఆదర్శ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న మైచర్ల అరవింద్ ఎంపికయ్యాడు. భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘వికసిత్ భారత్’ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో నిర్వహించిన పోటీల్లో సుమారు 50 లక్షల మంది విద్యార్థులు పాల్గొనగా, ప్రతిభ ఆధారంగా 200 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. వీరిలో ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు విద్యార్థులు ఎంపిక కాగా, అరవింద్ వారిలో ఒకరిగా నిలిచాడు. అరవింద్ ప్రదర్శించిన ఉత్తమ ప్రతిభకు గుర్తింపుగా భారత ప్రభుత్వం నుంచి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఎర్రకోట వద్ద ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా అరవింద్‌ను ప్రోత్సహించిన పీజీటీ సివిక్స్ ఉపాధ్యాయురాలు కె. డాలీ, క్లాస్ ఇన్‌చార్జి, పీజీటీ మ్యాథ్స్ ఉపాధ్యాయురాలు బి. సురేఖలను ఆదర్శ పాఠశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ సిహెచ్.వి రమణమూర్తి, ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు. అరవింద్ ఎంపిక పట్ల పాఠశాల సిబ్బంది, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
ఎర్రకోటలో స్వాతంత్ర్య వేడుకలకు ఆదర్శ పాఠశాల విద్యార్థి ఎంపిక
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 10, 2026, 04:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)