ప్రజాశక్తి - వేపాడ : వేపాడ మండలం ఎన్.కె.ఆర్. పురం హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని ఎంపీడీవో సిహెచ్. సూర్యనారాయణ ఆదివారం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ల స్వీకరణకు చేపట్టిన ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలు, ఇతర వసతులను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని, విధుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు కన్నంనాయుడు, నానిబాబు, సచివాలయ సిబ్బంది, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని పరిశీలించిన ఎంపీడీవో
15 నవంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 15, 2026, 02:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)