ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : 59 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా జిల్లా గ్రంథాలయ సేవా సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నాడు స్థానిక ఆర్ & బి జంక్షన్ వద్ద "పుస్తకహుండీ" కార్యక్రమం నిర్వహించారు. పుస్తకదాతలు విశేషంగా స్పందించడంతో వెయ్యికి పైగా పుస్తకాలను సేకరించారు. ఈ సందర్బంగా గౌరవ అధ్యక్షులు నాలుగెస్సులరాజు, అధ్యక్షులు కె. ఎర్నాయుడు, వ్యవస్థాపకులు అబ్దుల్ రవూఫ్, ప్రధాన కార్యదర్శి ఆర్.బాలకృష్ణ, ఉపాధ్యక్షులు కె. దయానంద్ లు మాట్లాడుతూ " మీరు చదివి విడిచిపెట్టిన పుస్తకాలకు మరలా జీవితాన్నివ్వండి " అన్న వాక్యానికి ప్రతిస్పందిస్తూ గత పదేళ్లుగా నిర్వహిస్తున్న పుస్తకహుండీ కార్యక్రమానికి పుస్తకప్రియుల నుండీ అపూర్వ ఆదరణ లభిస్తుందని, నేటికీ 10 వేలకు పైగా పుస్తకాలు సేకరించి జిల్లా వ్యాప్తంగా 40 కి పైగా ప్రజా గ్రంథాలయాలకు వితరణ చేయడమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో కో ఆర్డినేటర్ వేమలి చైతన్య బాబు, తోష్నివాలా క్లబ్ అధ్యక్షులు వి. కాశీనాయుడు, డాక్టర్. మజ్జి అప్పారావు, ఎ. రవికుమార్, దొంతల పాపునాయుడు, పి. అప్పారావు, ఎం. రామారావు, భాస్కర్ పట్నాయక్ లు పుస్తకాలను అందజేశారు. డి. సి. వి. ఎన్. రాజు, జనార్దనరావు, సత్యనారాయణ మూర్తి, డి. వి. రమణ, కర్రోతు సత్యం, ఈపు విజయ్ కుమార్, జి. కృష్ణారావు, టి. చిరంజీవి రావు తదితరులు పాల్గొన్నారు.
పుస్తక హుండీ కార్యక్రమానికి అపూర్వ ఆదరణ
5 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 17, 2026, 11:44 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)