ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 29 న శ్రీకాకుళం లోని కోడిరామ మూర్తి క్రీడా మైదానంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు సంబంధించిన దివ్యాంగ క్రీడాకారులకు పారా జూనియర్, సబ్ జూనియర్స్ జిల్లా స్థాయి పోటీలు నిర్వహిస్తున్నామని పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కె. దయానంద్ తెలిపారు. సోమవారం ఆయన ప్రజాశక్తితో మాట్లాడుతూ .... ఇందులో రన్నింగ్, షాట్ పుట్, లాంగ్ జంప్, డిస్కస్ త్రో, జావలిన్ త్రో పోటీలు ఉంటాయని అన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరచిన క్రీడాకారులు విశాఖపట్నం వేదికగా వచ్చేనెలలో జరుగబోయే 7 వ సబ్ జూనియర్, జూనియర్ పారా రాష్ట్ర స్థాయి ఛాంపియన్ షిప్ పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. 14 నుండి 19 ఏళ్ళ లోపు బాల, బాలికలు పోటీల్లో పాల్గొనేందుకు అర్హులని తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు ఈ నెల 28 సాయంత్రంలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఆధార్, సదరం, పాస్ ఫోటో తో పోటీలకు హాజరు కావాలని అన్నారు. ఇతర వివరాల కోసం 9177693836, 9849377577 నంబర్లను సంప్రదించాలని కోరారు.








కామెంట్లు (0)