అమరవీరుల కుటుంబాలకు ఘన సన్మానం
ప్రజాశక్తి – విజయనగరం కోట : విజయనగరం పోలీస్ పరేడ్ మైదానంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా జడ్జి బి. భవిత, జిల్లా కలెక్టర్ ఎస్. రామసుందర్‌రెడ్డి, జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ హాజరయ్యారు. పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం కోసం ఎంతోమంది పోలీసులు తమ ప్రాణాలను త్యాగం చేశారని తెలిపారు. వారి త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు.







కామెంట్‌లు (0)